పింఛన్ల పెంపుకు తరలిరావాలి

కోటగిరి:: ఈ నెల 18వ తేదీన నిజామాబాద్ పట్టణంలో జరిగే సన్నాహక సమావేశానికి ఉమ్మడి మండలంలోని ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఎమ్మార్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి సోంపూర్ పోచిరాం పిలుపునిచ్చారు.  బుధవారం కోటగిరి మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు శ్రీకాంత్ ఆధ్వర్యంలో  ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ లో 18వ తేదీన జరిగే సన్నాహక సమావేశానికి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు.మందకృష్ణ మాదిగ ముఖ్యఅతిథిగా హాజరవుతారని అన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు పింఛన్  పెంపు కార్యక్రమంపై నిర్వహించే సన్నాహక సభకు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో వి హెచ్ పి ఎస్.మండల అధ్యక్షులు.గొల్ల శ్రీనివాస్,ఎమ్మార్పీఎస్.అధ్యక్షులు శ్రీకాంత్,శివకుమర్,వెంకట్రావు,నాగమణి,సావిత్రి,నాగవ్వ, తదితరులు పాల్గొన్నారు.