
కోటగిరి: గ్రామ పంచాయతీ పాలకవర్గ సమావేశం సర్పంచ్ బర్ల మధుకర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీడీఓ విష్ణు మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావం దృష్ట్యా భవిష్యత్తులో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలని సూచించారు. ఇందులో భాగంగా గ్రామంలోని ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు నిర్మించేలా వార్డు సభ్యులు చొరవ తీసుకోవాలని కోరారు. అదేవిధంగా సింగిల్ ఫేజ్ మోటార్ల వద్ద మినీ వాటర్ ట్యాంకులు నిర్మించి నీటి వృథాను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు.
ఈ సమావేశంలో పంచాయతీ కార్యదర్శి సందీప్, ఉపసర్పంచ్ అలీనా తఫీన్, వార్డు సభ్యులు గంగాధర్, తౌఫిక్, వాజిద్, సతీష్, సైబాస్ ఖాన్, శ్రీనివాస్, షబానా బేగం, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.
