ఆలయాల్లో పూజలు, అన్నదానం

రుద్రూర్ : మండలంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం, శ్రీ వీరభద్రస్వామి ఆలయం, గైని గుట్ట స్వయంభూ బసవేశ్వర ఆలయంలో శ్రావణ సోమవారం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు, అభిషేకాలు, మంగళహారతులు అన్న పూజ చేశారు. శివనామస్మరణతో ఆలయాలు మారుమ్రోగాయి. భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.