రుద్రూర్ : మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో శుక్రవారం రుద్రూర్ అమన్ యూత్ సభ్యులు విద్యార్థులకు పరీక్ష అట్టలు,పెన్నులు, కంపాక్స్ బాక్సులు పంపిణీ చేశారు. స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు అమన్ యూత్ అధ్యక్షులు మొహమ్మద్ పుర్ఖాన్ ఖాద్రితెలిపారు. భవిష్యత్తులో అమన్ యూత్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో అమన్ యూత్ అధ్యక్షులు మహమ్మద్ ఫుర్ఖన్ ఖాద్రి, ఉపాధ్యక్షులు అవేజ్, కార్యదర్శి ముదస్సిర్, కోశాధికారి సిరాజ్, పైసల్, విండో డైరెక్టర్ షేక్ సుభాని, లతీఫ్, ఇషాక్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామ్ సింగ్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
