బాడీ బిల్డింగ్ ఛాంపియన్ కు సన్మానం

పోతంగల్ (స్థానికం న్యూస్) : బోధన్ డివిజన్ లో  బాడీ బిల్డింగ్ చాంపియన్ షిప్ పోటీలో ప్రథమ బహుమతి సాధించిన పోతంగల్ గ్రామానికి చెందిన వర్ని దీపక్ ను మంగళవారం వీరశైవ లింగాయత్ సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. గోల్డెన్ జిమ్ లో  దీపక్ కు తర్పిదు ఇచ్చి చాంపియన్ గా  తీర్చిదిద్దిన జిమ్ నిర్వహకులు పబ్బ శేఖర్ ను వారు అభినందించి సన్మానించారు.  కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ సమాజ్ అధ్యక్షుడు శివకుమార్ పటేల్, సభ్యులు శాంతీశ్వర్ పటేల్, కుశాల్ పటేల్, దిగంబర్ పటేల్, ప్రకాష్ పటేల్,  నితిన్ పటేల్, సంతోష్ పటేల్, ఓమన్న పటేల్ ,రాజ్ కుమార్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.