యాద్గార్ పూర్ వాసికి అవార్డు

కోటగిరి (స్థానికం న్యూస్): మండలంలోని యాద్గార్ పూర్ గ్రామవాసి జంగం శివ శాస్త్రీ  గ్లోబల్ ఐకాన్ యూత్ అవార్డు అందుకున్నారు. తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ యువజన దినోత్సవ ముగింపు ఉత్సవాలు హైదారాబాద్ లోని తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు.ఈ సంస్థ నిర్వహించే అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో భాగంగా 2025 సంవత్సరానికి గాను గ్లోబల్ ఐకాన్ యూత్ పౌరోహిత్యం అవార్డును నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం యాద్గార్ పూర్ గ్రామవాసి జంగం శివ శాస్త్రీ అందుకున్నారు. కార్యక్రమానికి హాజరైన ప్రముఖులలో తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ వ్యవస్థాపకులు డా.రాజ్ నారాయణ, ముఖ్య అతిథులుగా డిప్యూటీ చైర్మన్ ఆఫ్ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులు డా.బండ ప్రకాశ్, రాష్ట్ర మంత్రి జి. వివేక్ తదితరులు ఉన్నారు.