గణేష్ మండలి 75వ వార్షికోత్సవం

వైభవంగా శ్రీ సిద్ది వినాయకుని డైమాండ్ జూబ్లీ ఉత్సవాలు

పూజలందుకుంటున్న సిద్ధి వినాయకుడు

గణనాధుని నామస్మరణతో మారు మ్రోగుతున్న రుద్రూర్

ప్రతి రోజు హోమం, స్వామిజీల ప్రవచనం, అన్నదానం

నిమజ్జనం నాడు రాత్రంత సాంస్కృతిక కార్యక్రమాలు

రుద్రూర్ : మండల కేంద్రంలోని శ్రీ సార్వజనిక్ గణేష్ మండలి శ్రీ సిద్ధి వినాయకుని డైమాండ్ జాబ్లీ ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 1950లో సార్వజనిక గణేష్ మండలి ఏర్పాటైంది. నాటి నుండి ఒక ప్రత్యేకత ఉంది. 11 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాదుని నిమజ్జన శోభయాత్ర సంప్రదాయ భజనలు, కోలాట ప్రదర్శనల మధ్య భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. రాత్రి 10 గంటల వరకు శోభాయాత్ర కొనసాగుతుంది. శోభాయాత్రలో గడ్డితో చేసిన ఏనుగు ప్రత్యేక అలంకరణగా నిలుస్తుంది. గుర్రం విన్యాసాలు ఆకట్టుకుంటాయి. ప్రతి యేటా గాంధీ చౌక్ లో  నిలిపివేసి రాత్రంత సాంస్కృతిక కార్యక్రమాలు, పౌరణిక నాటకాలు నిర్వహిస్తారు. జాతర సాగుతుంది. సమీప గ్రామాల్లోకి ప్రజలు ఇక్కడే ఉంటారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి తరలివస్తారు . అంగడి బజార్ నవయుగ మండలి ఆధ్వర్యంలో పోటాపోటీగా పోగ్రామ్స్ నిర్వహిస్తారు. దీంతో అంగడి బజార్ నుండి గాంధీ చౌక్ వరకు రాత్రంత తిరుగుతూనే ఉంటారు. తెల్లవారుజామున మళ్లీ యాత్ర నిర్వహించి స్థానిక చెరువులో  నిమజ్జనం చేస్తారు.

డైమాండ్ బాబ్లీ సందర్భంగా మారిన వేదిక

ఈ యేడాది వేదికను బస్టాండ్ వెనుక ప్రాంతంలో ఉన్న విశాలమైన స్థలానికి మార్చాడు. వర్షాలు కురుస్తున్నందున స్టేజీ ఏర్పాటుకు , వీక్షకులు  కూర్చునేందుకు రూ. పదిలక్షల వ్యయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షం కురిసినప్పటికీ ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

అంగరంగ వైభవంగా డైమాండ్ జాబ్లీ కార్యక్రమాలు వినాయక చవితి మరుసటి రోజు నుండే ఆధ్యాత్మిక, ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రతి రోజు కుంకుమార్చన, హోమం, స్వామిజీ ప్రవచనం, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కార్యక్రమాలకు భక్తులు విశేష సంఖ్యలో హజరవుతున్నారు. ఉదయం నుండి రాత్రి పది గంటల వరకు గణనాధుని నామస్మరణ మారుమ్రోగుతుంది. సుమారు వంద స్పీకర్లను ప్రధాన వీధుల్లో అమర్చారు.వీటి ద్వారా సార్వజనిక్ గణేషుని వద్ద నిర్వహిస్తున్న కార్యక్రమాలన్ని అందరికి వినిపించి శ్రవణానందం కలిగిస్తున్నాయి. రాత్రి వేళ రుద్రూర్ రంగురంగుల విద్యుత్ కాంతులతో మెరిసిపోతోంది. వినాయకుని యాత్ర కొనసాగే దారిలో ఇరువైపులా, గ్రామంలోకి వచ్చే ప్రధాన ద్వారం, బస్టాండ్ లోని ప్రధాన చౌరస్తా ను విద్యుద్దీపాలతో ఆలంకరించారు. సమీప గ్రామాలకు కనబడే విధంగా బస్టాండ్ సమీపంలోని భవనంపైన ఆకాశంలో గాలితో నింపిన ఆకర్షణీయమైన పెద్ద బల్బు ఏర్పాటు చేశారు. ప్రతి రోజు చిన్నారులకు, మహిళలకు ఇండోర్ ఆట పోటీలు, రంగోలి, రన్నింగ్ వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందచేస్తున్నారు.

సాంస్కృతిక కార్యక్రమాలుభజనలు, సంకీర్తనలతో గత పది రోజులుగా మారు మ్రోగిపోతోంది. శనివారం హైద్రాబాద్ చిక్కడపల్లి ప్రవీణ్ బృందం  ఆర్కెస్ట్రా, జబర్థస్త్ టీమ్ పోక్ సింగర్స్ లక్ష్మి, మామిడి మౌనికల సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. శనివారం రోజు రాత్రంత నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించేందుకు 10వేలు మంది వస్తారనే అంచనా వేశారు. ఈ దిశగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. డైమాండ్ జూబ్లీ ఉత్సవాలు విజయవంతం చేసేందుకు ప్రణాళిక బద్దంగా సన్నహలు చేస్తున్నారు.

అందరికీ కృతజ్ఞతాభివందనాలు

– చిదుర వీరేశం,  గణేష్ మండలి అధ్యక్షుడు

సార్వజనిక్ గణేష్ మండలి ఏర్పాటై 75 యేండ్లవుతున్నందున ప్రతి రోజు హొమం, స్వామిజీల ప్రవచనం, అన్నదానం నిర్వహించాము. విద్యార్థులకు, మహిళలకు వివిధ పోటీలు నిర్వహించారు. డైమండ్ జాబ్లీ ఉత్సవాలు విజయవంతం చేయడానికి గ్రామస్తులు, నాయకులు, అధికారులు ఎంతో సహకారాన్ని అందిస్తున్నారు. వారందరికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము.