ఉత్తమ ఉపాధ్యాయురాలిగా రేణుక

బోధన్ ఎమ్మెల్యే చేతుల మీదుగా ఘన సన్మానం

కోటగిరి : ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికైన  కోటగిరి శ్రీ  వివేకానంద స్కూల్ టీచర్ పాకల రేణుక సోమవారం ఘన  సన్మానం అందుకున్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని సరయు  గార్డెన్స్ లో సోమవారం  బోధన్ డివిజన్ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం (ట్రస్మా) ఆధ్వర్యంలో   ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికైన రేణుకను బోధన్ ఎమ్మెల్యే పి . సుదర్శన్ రెడ్డి ఘనంగా సన్మానించారు . కార్యక్రమంలో ట్రస్మా అధ్యక్షులు కొడాలి కిషోర్, బోధన్ అధ్యక్షులు హరికృష్ణ, ట్రస్మా నాయకులు దిగంబర్, సూర్య ప్రకాష్,  శ్రీనివాసరావ్, రాజు, సత్యనారాయణ , హనుమంత్ రావ్, అనిల్ కుమార్  తదితరులు పాల్గొన్నారు.