బోధన్: మండలంలోని ఎరాజ్ పల్లి గ్రామానికి చెందిన కానిస్టేబుల్ గంగారాం ఇటీవల మరణించాడు. ఆయన 2013 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్ . మృతి చెందిన కానిస్టేబుల్ గంగారాం అమ్మ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని సమాచారం తెలుసుకున్న 2013 బ్యాచ్ కానిస్టేబుల్ లు బాధిత కుటుంబానికి చేయూత అందించారు. రూ. 10వేలు, బియ్యం, నిత్యావసర సరుకులు అందచేశారు. కార్యక్రమంలో కానిస్టేబుల్ లు గణేష్, సంతోష్, అనిల్, శివకృష్ణ, పోశెట్టి, గంగాకుమార్ తదితరులు పాల్గొన్నారు.
