రుద్రూర్: సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని లయన్స్ డిస్టిక్ చైర్మన్, దేవాంగ సంఘం అధ్యక్షులు శ్యామ్ సుందర్ పహాడే అన్నారు. మండల కేంద్రంలోని వాణి సాహితి పబ్లిక్ స్కూల్ లో సోమవారం రాత్రి దేవాంగ సంఘం ఆధ్వర్యంలో బోధన్ డివిజన్ దేవాంగ కుల సభ్యులైన ప్రభుత్వ , ప్రైవేటు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … ఉపాధ్యాయులు బోధించేవారు మాత్రమే కాదని, విద్యార్థులకు మార్గదర్శకులుగా, ఆదర్శప్రాయులుగా ఉంటారని అన్నారు. సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ.. వివిధ గ్రామాల్లో ఉన్న దేవాంగ కుల ఉపాధ్యాయులను ఒక దగ్గరకు చేర్చి సన్మానించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమ నిర్వహణకు తోడ్పాటు అందించిన పూర్వ అధ్యాపకుడు ఎంవీ గంగారాం మంచి మనసుకు నిదర్శనం అన్నారు. కార్యక్రమంలో దేవాంగ సంఘం సభ్యులు లోగం సురేష్, ఈర్వ శ్రీనివాస్, మేడం శివ కుమార్, టీ.చంద్ర శేఖర్, టి. శివ, తదితరులు పాల్గొన్నారు.
