పరిశోధన.. విస్తరణ… బోధన

రుద్రూర్:  నిజామాబాద్ జిల్లాలోని రుద్రూర్  ప్రాంతంలో వ్యవసాయ అభివృద్ధికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన బోధన, పరిశోధన, విస్తరణ సంస్థలు  కొనసాగుతున్నాయి.. మండల కేంద్రానికి సమీపంలో 1932లో ప్రాంతీయ చెరకు, వరి పరిశోధనా స్థానం ఏర్పాటు చేశారు. నాటి నుండి వ్యవసాయ శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు నిర్వహించి వరి, చెరకులో దిగుబడి పెంచే నూతన వంగడాలను రూపొందించి రైతులకు పరిచయం చేశారు. చెరకు లో ఇప్పటివరకు 15 అధిక దిగుబడి నిచ్చే రకాలను అభివృద్ధి చేశారు. వరిలో ఆర్ డిఆర్ పేరుతో పలు కొత్త వంగడాలు తయారు చేశాడు. ఇది రైతులకు ఎంతో లాభాలను తెచ్చి పెట్టాయి. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు చేస్తున్నారు.

-వరిలో వివిధ చీడపీడలను తట్టుకునే అధిక దిగుబడి నిచ్చే రకాలను అభివృద్ధి చేయడం

-చెరుకులో అధిక చక్కెర శాతం మరియు వివిధ చీడపీడలను తట్టుకునే అధిక దిగుబడినిచ్చే రకాలను అభివృద్ధి చేయడం.

-వరి, సోయాబీన్ మరియు చెరకులో నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి మరియు సరఫరా.

-నిజాం సాగర్ ఆయకట్టు ప్రాంతంలో తగిన వంటల పద్ధతిని గుర్తించడంపై పరిశోధన

-ఎక్కువ పంట దిగుబడి పొందడానికి నేల మరియు నీటి విశ్లేషణ సౌకర్యాన్ని అందించడం

ముఖ్యమైన విజయాలు:

అధిక దిగుబడినిచ్చే రకాలను అభివద్ధి చేయడం మరియు మెరుగైన వ్యవసాయ పద్ధతులతో చెరకు ఉత్పాదకతను ఎకరానికి 15 టన్నుల నుండి 50 టన్నులకు పెంచడంలో ప్రధాన పాత్ర పోషించింది. చెరకు లో ఇప్పటివరకు 15 అధిక దిగుబడినిచ్చే రకాలను అభివృద్ధి చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కో-6907, కో-12 19, కో-ఆర్-8001, కో-8014, కో-8011, 85 ఆర్ 186 (హరిత), 83 ఆర్ 23 (వసుధ) మరియు కో-1805 రకాలు ప్రసిద్ధి చెందాయి.

వరిలో ఇప్పటివరకు ఎనిమిది రకాలను ఈ పరిశోధనా స్థానం నుంచి అభివృద్ధి చేశారు.

గత ఏడాది ఒక చెరుకు రకం 2013 ఆర్ 81, రెండు వరి రకాలు ఆమ్రేఆర్ 1200 (రుద్రూరు వరి 1200), ఆర్జేఆర్ 1162 (రుద్రూరు వరి 1162) విడుదలయి రైతులలో ప్రాచుర్యం పొందాయి.

వ్యవసాయ విద్యలో 2 మరియు డాక్టరేట్ చేసిన విద్యార్థులకు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మరియు అతిల భారత వ్యవసాయ పరిశోధనా మండలి లో శాస్త్రవేత్తటుగా లేదా ప్రైవేట్ రంగంలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల

వ్యవసాయ పరిశోధన కేంద్రం అనుబంధంగా విత్తన సాంకేతిక పరిజ్ఞాన పాలిటెక్నిక్ 2005లో లో స్థాపించి ప్పటికీ, దీన్ని 2022లో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలగా మార్చారు. ఇందులో వ్యవసాయ సంబంధిత బోధనా తరగతులు నిర్వహిస్తారు. ఇది రెండు సంవత్సరాల డిప్లొమా కోర్సు. వదవ తరగతి తరువాత పాలీసెట్ ఎంట్రన్స్ అర్హత పొందిన వాటికి ఇందులో చేరే అవకాశం లభిస్తుంది. తరగతుల్లో పాఠాలు చెప్పడమే కాకుండా వ్యవసాయ పశిజ్ఞానాన్ని పెంపొందించడానికి ద్వితీయ సంవత్సరం పంట విత్తుటు నుండి కోత వరకు అనుభవం వచ్చేలా కోర్సులను నిర్వహిస్తారు. రెండు సంవత్సరాల కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత విద్యార్థులు అగ్రిసెట్ ప్రవేశ పరీక్షలో అర్హత పొందినదో నేరుగా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులో చేరవచ్చు డిప్లొమా అర్హతతో వ్యవసాయ విస్తీర్ణ అధికాలి ఉద్యోగం పొందే అవకాశాలు ఉన్నాయి.

కృషి విజ్ఞాన కేంద్రం

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీ భారత వ్యవసాయ పరిశోధన మండలి ఆధ్వర్యంలో 2004లో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేశారు. వ్యవసాయ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జిల్లా రైతాంగానికి మార్పులు చేర్పులతో క్రమబద్ధీకరణ చేసి అందించడం, క్షేత్ర ప్రదర్శనలు, శిక్షణ కార్యక్రమాలు, వ్యవసాయ విస్తరణ కార్యక్రమాల ద్వారా రైతులను చైతన్య పరచడం దీని ఉద్దేశం.  రైతులకు స్వయం ఉపాధి పెంపొందించుకొనే దీర్ఘకాలిక శిక్షణా తరగతులు నిర్వహిస్తారు.

జిల్లాలోని వివిధ ప్రధాన పంటలకు సంబంధించిన ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలన క్షేత్రాల ద్వారా రైతుల పొలాల్లో పని చేస్తున్నాయా లేదా మార్పులు చేర్పులు అవసరమా అన్న విషయాలను పరిశోధించడం. నిరూపితమైన వ్యవసాయ మరియు అనుబంధ రంగాల సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాల ద్వారా రైతుల పొలాల్లో నిర్వహించి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందిస్తోంది. గ్రామీణ యువతీ యువకులకు వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత రంగాల్లో నైపుణ్యాన్ని కల్పించి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. గ్రామీణ స్థాయిలో పని చేసే విస్తరణ అధికారులకు వ్యవసాయం, అనుబంధ రంగాలలో విజ్ఞానాన్ని పెంపొందించే శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. వరిలో నాణ్యమైన ఫౌండేషన్ వలి విత్తనాలను ఉత్పత్తి చేసి రైతులకు ప్రతి జన్ లో సకాలంలో అందజేస్తోంది. జిల్లాలో రైతులకు నూతన వ్యవసాయ పరిజ్ఞానాన్ని తెలియజేయడానికి క్షేత్ర దినోత్సవాలు,  రైతుల సదస్సులు, మేళాలు, ప్రదర్శనలు, క్షేత్ర ప్రదర్శనలు, సాంకేతిక వారోత్సవాలు నిర్వహిస్తుంది

ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల

రాజేంద్రనగర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల 2015లో ఏర్పాటు చేశారు. ఈ క్యాంపస్ 4 సంవత్సరాల ఇక్కడ నాలుగేళ్ల బి.టెక్ (ఫుడ్ టెక్నాలజీ) కోర్సును అందిస్తున్నారు. ఆహార రంగంలో డిమాండ్ ఆధారిత, విలువ ఆధారిత మరియు నాణ్యమైన సాంకేతిక విద్యను అందించే లక్ష్యంతో ఏర్పాటు చేశారు. ఈ కళాశాల 2021 సంవత్సరంలో న్యూఢిల్లీలోని ఐసిఎఆర్ ద్వారా ‘ఎ’ గ్రేడ్తో గుర్తింపు పొందింది.

ఈ కోర్సు నిరంతరం మారుతున్న పరిశ్రమ అవసరాలకు బాగా సరిపోతుంది. సిలబస్ ఐసిఎఆర్ డేన్స్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ఉంటుంది. కళాశాలలోని ఆధునిక ప్రయోగశాలను, మౌలిక సదుపాయాలు విద్యార్థులకు నుంచి సైద్దాంతిక మరియు ఆచరణాత్మక జ్ఞానాన్ని అందిస్తున్నాయి. 4 సంవత్సరాల బి.టెక్ సమయంలో (ఫుడ్ టెక్నాలజీ) లో, విద్యార్థులు పుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజనీరింగ్, ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ అస్యూరెన్స్, బేసిక్ ఇంజనీరింగ్, ఫుడ్ కెమిస్ట్రీ, ఫుడ్ మై క్రోబయాలజీ, ఫుడ్ ప్లాంట్ ఆపరేషన్స్ మరియు ఫుడ్ బిజినెస్ మేనేజ్ మెంట్ కోర్సులకు సంబంధించిన వివిధ విషయాలను అభ్యసిస్తారు. నాల్గవ సంవత్సరం అధ్యయనంలో విద్యార్థులు స్టూడెంట్ రెడీ (రూరల్ ఎంటర్ప్రైసైన్స్యూల్షిట్ అవేర్నెస్ డెవలప్మెంట్ యోజన) ప్రోగ్రామ్న మూడు మాడ్యూళ్లలో నిర్వహిస్తారు. అవి ఒక ప్రత్యాత పరిశ్రమలో 5 నెలల పాటు ‘ఇంటర్న్ షీట్ శిక్షణ’ 5 నెలల పాటు ‘ఎక్సవేరియన్షియల్ లెల్నింగ్ ప్రోగ్రామ్ (ఈ ఎల్పే)*, దీనిలో వారు చిన్న తరహా సంస్థను నడపడంలో కఠినమైన శిక్షణ పొందుతారు. యుజీ రీసెర్చ్ ప్రాజెక్ట్ విద్యార్థులు అన్ని విధాలుగా ఎదగడానికి కావలసిన పరిజ్ఞానాన్ని అందించడానికి ఈ కళాశాల కృషి చేస్తుంది. ఈ కళాశాల విద్యార్థులు ప్రభుత్వ, పెద్ద ప్రైవేట్ రంగ కంపెనీలలో ఉద్యోగం సాదించడానికి, చిన్న తరహ కంపెనీలు పెట్టుకోవడానికి ఎంతో ఉపయోగ పడుతుంది.

.