రుద్రూర్: ప్రతి ఏడాది డిసెంబర్ 5న ప్రపంచ మృత్తికా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సారి ఎఫ్ఎవో ఆరోగ్యకరమైన నేలలు ..ఆరోగ్యకరమైన నగరాలు’ అనే అంశాన్ని ప్రకటించిందని రుద్రూర్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం అధిపతి డా. కె. పవన్ చంద్ర రెడ్డి పేర్కోన్నారు. ఈ అంశం ద్వారా పట్టణాల్లో జరిగే నగరీకరణ, భవనాల నిర్మాణం, రోడ్లు, నేల గట్టిపడటం, నేల రంధ్రాలు మూసుకుపోవడం వంటి సమస్యల వల్ల నేల ఆరోగ్యం ఎంత ముఖ్యమో తెలియజేస్తుందన్నారు. ప్రపంచ మృత్తికా దినోత్సవం సందర్భంగా నేల ప్రాముఖ్యత, సంరక్షరణ గూర్చి ఆయన వివరించారు.
వ్యవసాయానికి నేల ప్రాముఖ్యత :
నేల పైర్ల ఎదుగుదల కి అవసరమైన నీరు, గాలి, పోషకాలను, అందచేస్తుంది .నేలలో ఉండే సూక్ష్మ జీవులు వంటలకు అవసరమైన పోషకాలను విడుదల చేస్తాయి. వర్షపు నీటిని నిల్వచేసి బెట్ట పరిస్థితులలో వంటలను రక్షిస్తుంది. నేలలో జీవపదార్థం ఎక్కువగా ఉంటే కార్బన్ నిల్వవుతుంది. పైర్లపై ఆశించే చీడపీడలను తెగుళ్లను తగ్గిస్తుంది. ఆరోగ్యమైన నేల వల్ల పైర్ల దిగుబడి, నాణ్యత పెరుగుతుంది.
నేల ముఖ్య విధులు:
పంటలకు అవసరమైన నీరు, గాలి, పోషకాలు అందిస్తుందని, వర్షపు నీటిని శోషించి భూగర్భ జలాలు పెంపొందిస్థాయి. పోషక చక్రాన్ని కొనసాగిస్తుంది.కాలుష్యాన్ని తగ్గించి సహజ శుద్ధి వ్యవస్థలా పనిచేస్తుంది.కార్బన్ నిల్వ చేయడం ఇళ్ల, రోడ్ల, నిర్మాణాలకు పునాది అందిస్తుంది.
నేల క్షీణతకు ప్రధాన కారణాలు:
నేల క్షయం (నీరు, గాలితో మట్టి తొలగిపోవడం), అడవుల నరికివేత, ఎక్కువగా పశువుల మేపడం. సేంద్రియ ఎరువుల వాడకం తగ్గడం, అధిక రసాయనాల వినియోగం, యంత్రాల వల్ల నేల గట్టిపడటం, లవణీకరణ (ఉప్పు పెరగడం), నీటిముంపు. జీవవైవిధ్యం తగ్గడానికి ప్రధాన కారణాలు.
నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సూచనలు:
వివిధ రకాల సేంద్రియ ఎరువులు, వచ్చిరొట్ట ఎరువులు, జీవన ఎరువులను విరివిగా వాడాలి.వంట అవశేషాలను కాల్చకుండా నేలలో కలియదున్నాలి. జీరో టిల్లేజ్ విధానం అవలంభించాలి. వైవిధ్యమైన వంటల సాగు, పంట మార్పిడి. నేలను కప్పివుంచే వంటలు వేయడం, సమర్ధవంతమైన మరియు సమతుల్య (భూసార పరీక్షా ఫలితాల ఆధారిత) ఎరువుల వినియోగం, జీవ మల్చింగ్ వంటివి పెట్టడం, డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ నీటి పొదువు వద్ధతులు అవలంబించడం వల్ల నేల ఆరోగాన్ని మెరుగు పర్చవచ్చునని
పట్టణాల్లో నేల పాత్ర:
పట్టణ వ్యవసాయానికి మద్దతు ఇస్తాయి. వర్ణనీటిని శోషించి శుద్ధి చేస్తాయి. కార్బన్ నిల్వ చేసి వాతావరణ మార్పును తగ్గిస్తాయి. నగరాలలో ఉష్ణోగ్రతలను నియంత్రిస్తాయి. పట్టణ జీవవైవిధ్యాన్ని కాపాడుతాయని డాక్టర్ పవన్ చంద్రరెడ్డి వివరించారు.


వ్యవసాయ పరిశోధన స్థానం, రుద్రూర్.
