

రుద్రూర్: జర్నలిస్ట్ లుగా సేవలందించి ప్రజా క్షేత్రంలో పోటి చేసి ప్రజాభిమానంతో సర్పంచ లుగా ఎన్నికైన పాత్రికేయులను మంగళవారం స్వచ్చంద సంస్థ సహయ, చేనేత సంఘం ఆధ్వర్యంలో వేర్వేరుగా ఘనంగా సన్మానించారు.పోతంగల్ మండల బకార్ పారం సర్పంచ్ గా కనకమేడల శ్రీనివాస్ రావ్ (వాసు), రుద్రూర్ మండలం చిక్కడపల్లి సర్పంచ్ గా మచ్కురి రమేష్ తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్లుగా ఘన విజయం సాధించారు. వీరిని స్వచ్ఛంద సంస్థ, సహకార సంఘం సభ్యులు సన్మానించి అభినందించారు. కార్యక్రమాల్లో సహయ ఆర్గనైజింగ్ కార్యదర్శులు సాంబశివరావ్, విఎం శివకుమార్, స్థానిక పాత్రికేయులు సురాజ్ శ్రీనివాస్, బి. నగేష్, టి. రాజశేఖర్, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు మోత్కురి నారాయణ, డైరక్టర్ ఎన్. గణేష్, సంఘ కార్యదర్శి ఈర్వ నాగరాజు, మేనేజర్ అంకం నర్సింలు, నేత కార్మికులు సుప్పల స్వామి, ఎం. నారాయణ, మాజీ వార్డు సభ్యుడు. దుర్కి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
