మన ఊరు..  మన భద్రత.. మన బాధ్యత

రుద్రూర్: మండలంలోని రాయకూర్ గ్రామంలో సోమవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో  మన ఊరు – మన భద్రత – మన బాధ్యత కార్యక్రమాన్ని  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  ఎస్ ఐ సాయన్న మాట్లాడుతూ…  సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ప్రాధాన్యం, రహదారి భద్రతపై అవగాహన  కల్పించారు.
ఈ సందర్భంగా గ్రామంలో డీజే శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు, మైనర్లు వాహనాలను నడపడం నివారిస్తామని  గ్రామస్థులు తీర్మానం చేశారు. అలాగే రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు ట్రాక్టర్ల వెనుక భాగంలో రేడియం స్టిక్కర్లు అమర్చాలని నిర్ణయించారు.
వర్షాకాలంలో దెబ్బతిన్న లేదా సురక్షితం కాని టైర్లతో ట్రాక్టర్లు నడపకూడదని ప్రత్యేకంగా అవగాహన కల్పించారు.
కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ పి. గంగమ్మ గంగారాం, మాజీ ఎంపిటిసి అనిల్ పటేల్, పోలీసు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.