
రుద్రూర్: తెలంగాణ ఐకెపి వివోఏ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రుద్రూర్ మండల సమీకృత భవన సముదాయం ఎదుట వివోఏలు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం మూడో రోజుకు చేరుకుంది. ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వివోఏలు ఆందోళన కొనసాగించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అధికారంలోకి వస్తే వివోఏలకు కనీస వేతనం రూ.26 వేలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే రెండేళ్లు గడిచినా ఇప్పటికీ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని,
సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీ వర్తింపచేయాలని, అర్హులైన వివోఏలకు సీసీలుగా పదోన్నతులు ఇవ్వాలని, సాధారణ, ప్రమాద, ఆరోగ్య భీమాలను రూ.20 లక్షల వరకు కల్పించాలని, ట్యాబ్లు, ఇంటర్నెట్ సౌకర్యం అందించాలని, జీఓ 58 సవరణ చేసి జాబ్ చార్ట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమ్మెలో మండలంలోని ఇంటి గ్రామాలకు చెందిన వీ ఓఏ లు పాల్గొన్నారు.
