భక్తి శ్రద్ధలతో బోనాల పండుగ

రుద్రూర్ : మండల కేంద్రంలో బోనాల పండుగ ఉత్సవాల ఘనంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరై ఊరేగింపు ప్రారంభించారు. శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయం వద్ద దేవాంగ సంఘం ఆధ్వర్యంలో మహిళలు బోనాలకు పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో ఊరేగింపులో పాల్గొని గ్రామదేవతలకు బోనం సమర్పించారు. పెరిక సంఘం వద్ద మహిళలు పూజలు నిర్వహించి బోనాలతో వెళ్లి ఊరేగింపులో పాల్గొన్నారు.