ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు


రుద్రూర్: మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు.  మండల టిఆర్ఎస్ ఇంచార్జ్ గాండ్ల మధు, మండల నాయకులు సాయికుమార్, బొట్టే గజేందర్, డౌర్ సాయిలు, మతిన్ తదితరులు పాల్గొన్నారు.
కోటగిరి : మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు తినిపించుకున్నారు. పార్టీ మండల సీనియర్ నాయకులు మోరే కిషన్, గౌతమ్ కుమార్, సమీర్, ఫారుక్, శ్రీనివాస్ గౌడ్, దేవేందర్, మారుతి పటేల్, యువ నాయకులు అరవింద్, సంతోష్, గంగ ప్రసాద్ గౌడ్, అహ్మద్ , ఆంజనేయులు, హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు.