రుద్రూర్: నసురుల్లాబాద్ మండల ఉత్తమ ఉపాధ్యాయుడిగా సన్మానం పొందిన నూతిపల్లి బాలరాజు అవార్డుకు వన్నె తెచ్చారు. నసురుల్లాబాద్ మండల కేంద్రంలో సోమవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాలరాజును బెస్ట్ టీచర్ గా ఎంపిక చేసి ఘనంగా సన్మానం చేశారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ.. గతంలో బాలరాజు మద్నూర్ మండల స్థాయి, కామారెడ్డి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ప్రశంస పత్రాలు, మెమోంటో లు అందుకున్నారు. తెలంగాణ ఒపెన్ ఇంటర్మీడియెట్ పాఠ్య పుస్తక రచయితగా, ఎస్సీఈఆర్టీలో డిజిటల్ పాఠాల తయారి, యూనిసెఫ్ ఆధ్వర్యంలో వీడియో లెస్సన్స్ తయారు చేయడం తో పాటు వివిధ అంశాలపై జిల్లా రిసోర్స్ పర్సన్ గా పనిచేశారని కొనియాడారు. కార్యక్రమంలో నస్రురుల్లాబాద్ మండల ఎంపీడీవో రవీశ్వర్ గౌడ్, మండల విద్యాధికారి డి.చందర్, పీజీ హెచ్ఎంలు దుర్గాబాయి, ప్రేమ్ దాస్, పీఆర్టియు మండల అధ్యక్షుడు హన్మండ్లు, ప్రధాన కార్యదర్శి శ్రీ చంద్, తపస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
