డా.విశ్వనాధ్ మహాజన్, రుద్రూర్

నిజామాబాద్ (స్థానికం న్యూస్): చత్రపతి శివాజీ అసలు పేరు శివాజీ బోన్స్లే 19 ఫిబ్రవరి 1630 శివనేరి కోటాలో జన్మించాడు, ఈయన తండ్రి
షాహజీ బోన్స్లే , తల్లి జీజ బాయ్ బోన్స్లే చిన్నప్పటినుండే భక్తి , దేశభక్తి మరియు వీరుల చరిత్ర తెలుసుకొని అనేక సాహస కృత్యాలు చేసి దైవభక్తి పట్ల ప్రేమ అనురాగం కలిగిన వ్యక్తి శత్రువుల గుండెల్లో నిద్రపోనియ్యకుండా అనునిత్యం అఖండ భారతదేశాన్ని కాపాడిన శివాజీ 3 ఏప్రిల్ 1680 లో నందు రాయగడ్ కోటాలో దేహ త్యాగం చేయడం జరిగింది.
శివాజీకి గోమాత పట్ల గల ప్రేమను తన 12 ఏళ్ల వయసులో చూడవచ్చు, ఒకరోజు జైపూర్ రాజమార్గంలో వెళుతుండగా ఒక కసాయి గోమాతను చంపే ప్రయత్నం చేశాడు ఆ గోమాత అనేక విధాలుగా ఆ కసాయి నుండి విడిపించుకోవాలని ప్రయత్నం చేసిన కసాయి వాడు విపరీతంగా కొట్టడం జరిగింది ,ఆ కసాయి నుండి విడిపించుకోవాలని గోమాత ప్రయత్నాన్ని ,దృశ్యాన్ని చూసి చలించిపోయి ఆ కసాయి వద్దకు వెళ్లి తన దగ్గర ఉన్నటువంటి ఖడ్గాన్ని తీసి గోమాత మెడలో ఉన్న తాడుని తెంపివేయడం జరిగింది , ఆదృశ్యాన్ని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూసిన దగ్గరకి రాలేదు , ఈ దృశ్యాన్ని చూసిన చత్రపతి శివాజీ ఆ కసాయి వాడి మెడను రెండు భాగాలు చేసి వధించడం జరిగింది,ఈ విధంగా చేసిన సహాస కృత్యాన్ని బీజాపూర్ నవాబు అతన్ని తన రాజ్యం నుంచి బహిష్కరించడం జరిగింది, తరువాత శివాజీ గొప్పతనాన్ని విని స్వయంగా తన రాజ్యానికి పిలిపించి సకల మర్యాదలతో , తలవంచి ఆహ్వానించడం జరిగింది, తల్లి తన కుమారుడితో ఈ విధంగా అన్నది
ఇవన్నీ వివాదాలు ఎందుకు బేటా బాద్షా ముందు లొంగిపోతే బాగుంటుంది కదా అని అనగా తన తల్లితో ఈ విధంగా అంటాడు “మా అగర్ ఆఫ్ చహతే హోతో ఆప్కే చర్నోమే సిర్ కాట్కర్ లగావుంగ ,లేకిన్ మొగల్ బాద్షా కె పాస్ సిర్ నహి జుకాహుంగా “అనగా “అమ్మ నీవు ఆజ్ఞాపిస్తే నీ పాదాల ముందు నా తల నరికి పెడతాను కానీ మొగల్ రాజు ముందు నా తలవంచను” అని తన వీరత్వాన్ని చాటిన వ్యక్తి, దీని ద్వారా అనగా (దునియా జుక్తి హై జుకానే వాల హోనచాయ్యి) “ప్రపంచం వంగుతుంది వంచిపించే వాడు కావాలి” అతడే చత్రపతి శివాజీ.
చత్రపతి శివాజీ గురువైన సమర్థ రామదాసు స్వామి మార్గదర్శనంలో అఖండ భారతదేశాన్ని జయించిన వీరుడు , శూరుడు,యోధుడు మన చత్రపతి శివాజీ.
ఈ విధంగా యువతకు మరియు మన పిల్లలకు వచ్చే భవిష్యత్తు తరాల వ్యక్తులకు ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తి చత్రపతి శివాజీ , ఈయన జయంతి మనకు గురుభక్తి (సమర్థ రామదాస్ స్వామి),సనాతన ధర్మ పరిరక్షణ , దేశభక్తి ,మాతృ భూమి పట్ల కృతజ్ఞత, ప్రేమ,దేశ రక్షణ , శీల నిర్మాణం, నైతిక మరియు మాతృభక్తి ప్రతి వ్యక్తిలో ఉండాలని ప్రతి ఒక్కరూ సంకల్పం చేయాలి.
