–దుమ్ము రేపిన జబర్ధస్త్ సింగర్స్
–రాత్రంతా సాంస్కృతిక కార్యక్రమాలు

రుద్రూర్: మండల కేంద్రంలో వినాయక నిమజ్జనం సందర్భంగా ఆదివారం తెల్లవారుజాము వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. జై బోలో గణేష్ మహరాజ్, గణపతి బొప్పా మోరియా అనే నినాదాలతో మండల కేంద్రం మారుమ్రోగింది. 11 రోజుల పాటు పూజలు అందుకున్న సార్వ జనిక్, నవయుగ , శ్రీ కృష్ణ గణేష్ మండలి గణనాధులను ఆదివారం స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు. సార్వజనిక్ గణేష్ మండలి ఏర్పాటై 75 ఏళ్లు ఐన సందర్బంగా డైమాండ్ జూబ్లీ వేడుకలు వైభవంగా నిర్వహించారు. చివరి రోజు గ్రామంలోని ప్రధాన వీదుల ద్వారా నిర్వహించి సంప్రదాయంగా శనివారం రాత్రి 11 తత్కాలికంగా శోభాయాత్రను నిలిపివేశారు.


అంగడి బజార్ లో నవయుగ గణేష్ మండలి, బస్టాండ్ సమీపంలో సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో రాత్రంత సాంస్కతిక కార్యక్రమాలు ( అర్కెస్ట్రా, తదితర) నిర్వహించారు. కళాకారులు ఇచ్చిన ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. హైద్రాబాద్ కు చెందిన చిక్కడపల్లి ప్రవీణ్ ఆర్కెస్ట్రా బృందం, జబర్దస్త్ ఫోక్ సింగర్స్ లక్ష్మీ, మౌనిక, హాస్యనటులు ఆడిపాడి ఆహుతులను అలరించారు. చిన్నారుల భరత నాట్యం, గోవిందా బృందం నృత్యాలు మనోల్లాసాన్ని కలిగించాయి. సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించడానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి బారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. స్టేజీతో పాటు మరో మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్క్రీన్ ల వద్ద జనం ప్రదర్శనలు తిలకించి ఎంజాయ్ చేశారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఐ కృష్ణ, ఎస్సై సాయన్న పర్యవేక్షించారు. పంచాయతీ, పోలీస్ ,విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రోగ్రాం సక్సెస్ కావడానికి అవసరమగు సహకారాన్ని అందించారు.
వినాయకుని రథం షెడ్డుకు రూ. ఐదు లక్షలు
–ఎమ్మెల్యే పోచారం హామీ

బాన్సువాడ ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ సలహదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల రాజుతో కలిసి ప్రోగ్రాం తిలకించారు. సార్వజనిక్ గణేష్ మండలి డైమాండ్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న నిర్వహకులను అభినందించారు. వారి కోరిక వేరకు నూతనంగా రూపొందించిన వినాయకుని శోభాయాత్ర రథం నిలిపే షెడ్డు కోసం రూ. ఐదు లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మండల నాయకులు, కమిటి సభ్యులు పాల్గొన్నారు.