గ్రామాభివృద్ధికి సహకరించాలి

పోతంగల్: మండలంలోని సుంకిని గ్రామంలో సర్పంచ్ సిందే షాజీ పటేల్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. గ్రామ అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా ఎండాకాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అవసరమున్న వార్డుల్లో డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సూచించారు. కొత్తగా ఏర్పడుతున్న ప్లాట్లలో విద్యుత్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని తీర్మానించారు.
గ్రామ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పని చేయాలని సర్పంచ్ సిందే షాజీ పటేల్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కవితచంద్రకాంత్, ఏఎంసీ చైర్మెన్ గాయక్వాడ్ హన్మంతు, జీపీ కార్యదర్శి రాము, గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.