రుద్రూర్: మండల కేంద్రంలో గోపాల కాలువ (ఉండల పండుగ) వేడుకను గురువారం సాయంత్రం ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. ప్రధాన వీదుల ద్వారా రుక్మిణి సహిత విఠలేశ్వరుని స్వామి శోభా యాత్ర నిర్వహించారు . ఈ సందర్భంగా భక్తులు పేలాలు, బెల్లంతో తయారుచేసిన లడ్డూలను ఎగరవేశారు . ఈ లడ్డులను అందుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. గత కొన్ని ఏండ్లుగా లడ్డూలు ఎగరేసే సంప్రదాయం వస్తుందని గ్రామ పెద్దలు వెల్లడించారు. శ్రీ విఠలేశ్వర ఆలయం వద్ద ప్రారంభమైన శోభ యాత్ర గ్రామంలోని శ్రీహనుమాన్ ఆలయం, శ్రీ రేణుక ఎల్లమ్మ దేవీ ఆలయం, శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయం , శ్రీ నగేశ్వర ఆలయం ద్వారా శోభయాత్ర కొనసాగింది. శోభ యాత్రలో ఆలయ పూజారులు, ఆలయ్య కమిటీ సభ్యులు , భక్తులు పాల్గొన్నారు.

