ఉద్యోగులకు పదవి విరమణ తప్పదు

రుద్రూర్: ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పదని ,శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలని రుద్రూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం అధిపతి డాక్టర్ సమతా పరమేశ్వరి అన్నారు. శనివారం  పరిశోధన స్థానం ఉద్యోగులు జమీలబి, తేజమ్మ పదవి విరమణ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడి పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు.  పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులకు శాలువా పూల బొకేతో ఘనంగా సత్కరించి వారి సేవలను గుర్తు చేశారు. కార్యక్రమంలో పరిపాలన అధికారులు రాకేష్, శంకర్, శాస్త్రవేత్త డాక్టర్ రమ్య రాథోడ్, వ్యవసాయ విస్తీర్ణ అధికారి షేక్ ఈసా,హబీబ్, అక్బర్ హుస్సేన్, ఖదీర్, శేఖర్ శేఖర్, సాయిలు, రమేష్, కళావతి, రత్నమ్మ, లలిత, సుమలత వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థులు, ఉద్యోగులు  పాల్గొన్నారు.