కోటగిరి లో  అన్నదాన కార్యక్రమం

కోటగిరి :  మండల కేంద్రంలో బుధవారం లయన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి డైమండ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఘట్టమనేని బాబురావు జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు.  లయన్ ఘట్టమనేని బాబురావు అందిస్తున్న సేవలను కొనియాడారు.  కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కోటగిరి డైమండ్ అధ్యక్షులు తెల్ల రవికుమార్ , కార్యదర్శి హనుమంత్ రావ్ పటేల్,  సభ్యులు పప్పుల యోగేష్ , కోయగూర్ శ్రీకాంత్, స్థానికులు కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు గర్దాస్ ఆనంద్ దౌలయ్య ,కన్నం శ్రీనివాస్ ,హస్కుల శ్రీకాంత్ ,జెండా దినేష్,  నవీన్ , అరవింద్, గంగా ప్రసాద్ గౌడ్ ,సందీప్ ,వినోద్ పటేల్ , రఘువీర్,   కిషన్ ,రహీం ,మిట్టు ,ఇమ్రాన్, సల్మాన్, గంగాధర్  అర్పిత్  తదితరులు పాల్గొన్నారు.