
రుద్రూర్ : మండల కేంద్రానికి చెందిన అప్పన్న మోకాల మార్పిడి శస్త్ర చికిత్స కొరకు ఇటీవల స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ద్వారా ఎల్ఓసికి దరఖాస్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే కృషితో సీఎం రేవంత్ రెడ్డి రూ. 80 వేల ఎల్ఓసి మంజూరు చేశారు. ఎల్ఓసి పత్రాన్ని మంగళవారం స్థానిక నాయకులు బాధితుడు అప్పన్నకు అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, మాజీ జడ్పిటీసి నరోజి గంగారాం, సింగల్ విండో మాజీ చైర్మన్ పత్తి రాము, ఎఏం సి డైరెక్టర్ పార్వతి ప్రవీణ్ , మండల నాయకులు అక్కపల్లి నాగేందర్ పాల్గొన్నారు.