కోటగిరి: నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సి.హెచ్ దయానంద్ అన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా కోటగిరి–పోతంగల్ ఉమ్మడి మండలాల నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు బుధవారం కోటగిరి మండల కేంద్రంలో దయానంద్ ను, ఎత్తొండ వార్డు సభ్యుడు శ్రీనివాస్ ను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా దయానంద్ మాట్లాడుతూ… తనపై నమ్మకం ఉంచి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్న సంఘ సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నాయి బ్రాహ్మణుల సమస్యల పరిష్కారం, సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం సంఘాన్ని మరింత బలోపేతం చేస్తానని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు విశ్వనాథ్, హన్మండ్లు, కామయ్య, విట్టల్, రాము, మోహన్, శంకర్, సచిన్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

