ఎన్టీఆర్ కు ఘన నివాళి

పోతంగల్: నందమూరి తారక రామారావు ప్రజలకు ఎనలేని సేవలు అందించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా చిరస్మరణీయుడుగా నిలిచిపోయారని  సర్పంచ్ కనకమేడల  శ్రీనివాసరావు అన్నారు.  పోతంగల్ మండలం భాకర్ ఫారం లో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సర్పంచ్ మాట్లాడుతూ… బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిన సేవలను ప్రజలు ఎన్నటికీ మరువలేరన్నారు. పటేల్ పట్వారి వ్యవస్థను రూపుమాపి రైతులకు పట్టేదారు  పాస్ పుస్తకాలను అందించిన ఘనత ఎన్టీఆర్ కు దక్కుతుందన్నారు.  సినీ రంగంలో పేరు ప్రఖ్యాతలు గడించడంతోపాటు రాజకీయాల్లో  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఓ విప్లవాన్ని సృష్టించారని అన్నారు. కార్యక్రమానికి హాజరైన సర్పంచ్ కు, విద్యుత్ శాఖలో పనిచేస్తున్న అధికారులకు, మెరుగైన సేవలు అందిస్తున్న పంచాయతీ సిబ్బందికి పూల మాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో  చేతన నగర్ సర్పంచ్ సునీల్, బాకర్ ఫారం ఉపసర్పంచ్ సంతోష్, కారేగాం మాజీ ఉపసర్పంచ్ శివరాజ్ పటేల్, గ్రామ వార్డు సభ్యులు సత్యనారాయణ, ఉత్తం, కె .బాబురావు, ఎం.పూర్ణచంద్రరావు, ఎం .వినోద్ బాబు, వీరేశం పటేల్, బంటు సాయిలు, నగేష్, యాదవరావు, సుశిత్,  నరసింహారావు,  ప్రభాకర్ రావు, రాంబాబు,  దత్తు తదితరులు పాల్గొన్నారు.