
రుద్రూర్: తల్లిదండ్రులకు సేవ చేయడం అత్యంత పవిత్రమైనదని శ్రీ బాల యోగి పిట్ల కృష్ణ మహారాజ్ అన్నారు. రుద్రూర్ సార్వజనిక్ గణేష్ మండలి సిద్ధి వినాయకుని మండపంలో మంగళవారం భక్తులకు ఆయన ప్రవచనం ఇచ్చారు. తల్లిదండ్రుల చుట్టూ వినాయకుడు మూడుసార్లు ప్రదక్షిణం చేసి గణాధిపతి అయ్యారని వృత్తంతాన్ని వివరించారు. గోసేవ ప్రాముఖ్యత, గోమూత్రం, గోవు పేడ ద్వారా కలిగే ప్రయోజనాలు వివరించారు.
కుంకుమార్చన, హోమము, అన్నదానం
సార్వ జనిక్ గణేష్ మండలి సిద్ధి వినాయకునికి మంగళవారం కుంకుమార్చన ,హోమము ,ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు భక్తులు విశేష సంఖ్యలో హాజరయ్యారు.

