కోటగిరి : మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ అమర వీరుడు పోలీస్ కిష్టయ్య 16వ వర్ధంతి నిర్వహించారు . ఈ సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళు అర్పించారు. అనంతరం ముదిరాజ్ సంఘం మహిళా అధ్యక్షురాలు, మాజీ సర్పంచ్ హంగార్గ స్వరూప గంగాధర్ మాట్లాడుతూ…మలిదశ తెలంగాణ ఉద్యమంలో వీర మరణం పొందిన కానిస్టేబుల్ కిష్టయ్య త్యాగాలు వెలకట్టలేమని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ముదిరాజులందరూ ఐకమత్యంగా ఉండి మంచి నాయకున్ని ఎన్నుకుని కానిస్టేబుల్ కిష్టయ్య వర్ధంతి, జయంతి వేడుకలు నిర్వహించుకునేందుకు స్థలాన్ని సేకరించుకుని ఆ మహనీయుని విగ్రహ ఏర్పాటుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉమ్మడి మండల ముదిరాజ్ సంఘం ఇంచార్జ్ అధ్యక్షులు కోటగిరి సుదర్శన్, జిల్లా యూత్ అధ్యక్షులు కప్ప గణేష్, మండలాల ముదిరాజ్ సంఘం ఇంచార్జ్ డా.సాయిలు, కప్ప సంతోష్, ముదిరాజ్ సంఘం ఆయా గ్రామాల అధ్యక్షులు,నాయకులు సభ్యులు పాల్గొన్నారు.

