సన్మార్గం, భక్తి మార్గంతోనే ముక్తి

వేదపండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ

రుద్రూర్: సన్మార్గం, భక్తి మార్గంతోనే ముక్తి లభిస్తుందని కామారెడ్డి వేదపండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ అన్నారు. మండల కేంద్రంలోని శ్రీ సార్వజనిక్ గణేష్ మండలి శ్రీ సిద్ధి వినాయక 75వ వార్షికోత్సవం పురస్కారించుకుని శనివారం గణేష్ మండలిని సందర్శించి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రవచనం చేశారు. మహగణపతి వ్రతం, సత్య వినాయక వ్రతం గూర్చి వివరించారు. దుర్గాణాలు విడిచిపెట్టాలని అప్పుడే ప్రశాంత జీవనం పొందుతారని వివరించారు. భక్తులు ఉదయం వినాయకుని మండపంలో సహస్ర పుష్పార్చన చేశారు. గణేష్ మండలి ఆధ్వర్యంలో హోమం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.