ఇంటర్ లో రుద్రూర్ విద్యార్థి ప్రతిభ

రుద్రూర్: మండల కేంద్రానికి చెందిన రెంజర్ల సాత్విక్ గౌడ్ ప్రభుత్వ సాంఘీక సంక్షేమ రెసిడెన్షియల్ ఇంటర్ చదివి 992/1000 మార్కులు సాధించాడు. ప్రాథమిక విద్య వర్నిలో, ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు కామారెడ్డి జిల్లా ఉప్పల్ వాయి గురుకుల పాఠశాలలో, ఇంటర్ గచ్చిబౌలి  గౌలి గూడ (హైద్రాబాద్ ) గురుకుల సాంఘీక సంక్షేమ పాఠశాలలో చదివాడు. తండ్రి నారాగౌడ్ కులవృత్తిలో ఉండగా, తల్లి లావణ్య ఐకెపిలో వివోఏగా విధులు నిర్వహిస్తోంది. పేద కుటుంబానికి చెందిన సాత్విక్ గౌడ్ ప్రభుత్వ కళాశాలలో చదివి కార్పోరేట్ స్థాయి మార్కులు సాధించాడని రైడ్స్ ( రుద్రూర్ ఇంటిగ్రేటేడ్ డెవలప్మెంట్ ఎడ్యుకేషనల్ సోసైటీ) సభ్యులు అభినందనలు తెలిపారు.