కోటగిరి లో శ్రీ లక్ష్మీ గణపతి హోమం

కోటగిరి : మండల కేంద్రంలో సార్వజనిక్ గణేష్ మండలి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గురువారం లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు.  వేద పండితులు రాజు మహారాజ్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు.  బీఆర్ఎస్ మండల నాయకులు తెల్ల అక్షర రవికుమార్ దంపతులు,  మాశెట్టి విట్టల్ దంపతులు, నూకల రమేష్ దంపతులు, పొమ్మేడి  శివ దంపతులు , మంగలి శంకర్ దంపతులు హోమంలో కూర్చున్నారు.  హోమం ముగిసిన అనంతరం అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. హోమం, అన్నదాన కార్యక్రమాలకు  సహకారాన్ని అందజేసిన  తెల్ల అక్షర రవికుమార్ దంపతులను ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సత్కరించారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ అనిల్ కులకర్ణి, ఉత్సవ కమిటీ సభ్యులు అరుణ్ గౌడ్ ,నాగరాజు, మనోజ్ గౌడ్ జలంధర్ ,అభిషేక్ ,ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.