సిద్దాపూర్ తండాలో ఘనంగా నాగదేవత వేడుకలు

వర్ని:  మండలంలోని సిద్దాపూర్ తండాలో ప్రేమ్ సింగ్  ఇంటి వద్ద నాగదేవత వేడుకలు నిర్వహించారు .ఈ సందర్భంగా హోమం చేసి జండా ఆవిష్కరించారు.  సంస్కృతి, సంప్రదాయాలతో పాటలు పాడుతూ   భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.  అనంతరం అన్నదాన ప్రసాదాన్ని  స్వీకరించారు. కార్యక్రమంలో శ్రీ సద్గురు శక్తి బాబా, శ్రీ రామ్ సింగ్ మహారాజ్, శ్రీ సరించంద్ మహారాజ్, శ్రీ అజయ్ మహారాజ్, శ్రీ లల్లా మహారాజ్, శ్రీ జగదీష్ మహారాజ్, గ్రామ నాయకులు మహిళలు పాల్గొన్నారు.