స్వామీ వివేకానంద  బోధనలు స్ఫూర్తిదాయకం

కోటగిరి: స్వామీ వివేకానంద యువతకు మార్గదర్శకుడని, ఆయన బోధనలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని బోధన్ ఏసీపీ శ్రీనివాస్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని వివేకానంద హై స్కూల్ లో  సోమవారం స్వామి వివేకానంద జయంతి ఘనంగా నిర్వహించారు.   శ్రీ రామకృష్ణ సేవా సమితి, రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏసిపి మాట్లాడుతూ….దేశ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని వివేకానంద సందేశాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలన్నారు.

ఈ కార్యక్రమంలో  తహసిల్దార్ గంగాధర్, ఎంవీఐ శ్రీనివాస్, స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వతి,రెడ్ క్రాస్  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్, జిల్లా అధ్యక్షులు బుస్స ఆంజనేయులు, కోశాధికారి కరిపే రవీందర్, జిల్లా కార్యవర్గ సభ్యులు సూర్యనారాయణ, హనుమంతరావు, సర్పంచ్ బర్ల మధుకర్, కొట్టం మనోహర్, యువ నాయకులు మాశెట్టి ఆదిత్య, రామకృష్ణ సేవాసమితి అధ్యక్షులు గోగినేని శివ శ్రీనివాస్, సభ్యులు హనుమంతరావు, రవిచంద్ర,  గంగాధర్, శివ చరణ్, బర్ల రమేష్, నితిన్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.