
రుద్రూర్: మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద స్థానికులు యువకులతో కల్సి శ్రమదానం చేశారు. శ్రావణ మాస పౌర్ణమి సందర్భంగా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. ఇందులో భాగంగా స్థానిక యువకులు ఆలయ పరిసరాలను శుభ్రంగా చేశారు. వందల ఏళ్ల నాటి ఆలయం జీర్ణోదారణ అవుతున్నందున నూతనంగా పునః నిర్మాణానికి కమిటి ఆధ్వర్యంలో ఇటీవల దేవాదాయ శాఖ అధికారులను కల్సినట్టు వారు వివరించారు. కార్యక్రమంలో దుర్కి అనిల్, మోత్కూర్ రాములు, దుర్కి రవి, దుర్కి సురేష్, పెంట శంకర్ గౌడ్, దుర్కి చింటూ, దుర్కి గంగాధర్, దుర్కి సాయిలు, గట్టు సాయిలు,దుర్కి శ్రీను, గాండ్ల భాస్కర్, తోట వెంకటేష్ కచ్చకాయల దత్తు, బండారెంజల్ సాయిలు, దుర్కి గజేందర్ తదితరులు పాల్గొన్నారు.