

కోటగిరి: మండలంలోని రాంపూర్ గ్రామంలో సోమవారం కోరుట్ల పశు వైద్య కళాశాల , పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కళాశాల వైద్య బృందం , వైద్య నిపుణుల సమక్షంలో శిబిరాన్ని కొనసాగించారు. వివిధ రకాల అనారోగ్య సమస్యలను, పేడ పరీక్షల ను పరీక్షించారు. గర్భకోశ నిపుణుల సమక్షంలో తొలి దశ గర్భ చూడి నిర్ధారణ ను కూడా అల్ట్రా సౌండ్ స్కానర్ ద్వారా 14 నిర్ధారణ చేశారు. ఆవులు, గేదెలకు, ఆవు దూడలకు ,గేదె దూడలకు గొర్రెల కు, మేకలకు నట్టల నివారణ మందులు త్రాగించారు.
పశుపోషకులకు పశు పోషణ, శుభ్రత , పశువుల నుండి మనుషులకు మనుషుల నుండి పశువులకు సంక్రమించే వ్యాధుల గురించి పశుగ్రాసాల గురించి కళాశాల విద్యార్థులకు అవగాహన కలిగించారు. పశుపోషకులకు మినరల్ మిక్చర్ , కాల్షియం అందజేశారు. . పీవీ నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం కోరుట్ల ఫ్యాకల్టీస్ డా.జగన్ మోహన్ రెడ్డి, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ సురేశ్, డాక్టర్ అతిధి, డాక్టర్ రవికుమార్, డాక్టర్ శ్రీకాంత్ , జూనియర్ వెటర్నరీ డాక్టర్ లు, రాంపూర్ సర్పంచ్ శాంకిబాయి శంకర్, కోటగిరి సర్పంచ్ మధు, రాంపూర్ ఉపసర్పంచ్ సాయిలు, లయన్స్ క్లబ్ ప్రోగ్రాం చైర్మన్ శ్రీనివాస్, పశు వైద్య సిబ్బంధి సాయి చందర్ , గోపాల మిత్ర రియాజ్, మైత్రి మిత్ర రాజేష్ ,రైతులు పాల్గొన్నారు.
