మండల స్థాయి జీవశాస్త్ర ప్రతిభ పాటల పోటీలను సోమవారం నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి డి. చందర్ మాట్లాడుతూ సైన్స్ పట్ల అవగాహన పెంచుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో జీవశాస్త్ర ఉపాధ్యాయులు మల్లెపూల ఇందిరా, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.
