ఇళ్ల సర్వే నుండి మినహాయించాలి

రుద్రూర్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం మండల అభివృద్ధి అధికారి సురేష్ బాబుకు సోమవారం గ్రామపంచాయతీ కార్యదర్శులు వినతి పత్రం అందజేశారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని, ఇందిరమ్మ ఇళ్ల సర్వే నుండి మినహాయింపు ఇవ్వాలని వారు విన్నవించారు. వినతి పత్రం అందజేసిన వారిలో కార్యదర్శులు గంగాధర్, గంగారాం, గౌస్, చైతన్య, శ్రీనివాస్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.