

కోటగిరి : ఉమ్మడి కోటగిరి–పోతంగల్ మండలాల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ప్రస్తుత కార్యవర్గం పదవీకాలం ముగియడంతో పాత కార్యవర్గాన్ని రద్దు చేసి కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు.
ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా పుల్కంటి కృష్ణ కుమార్ (V6 వెలుగు), ఉపాధ్యక్షుడిగా పుప్పల సైదయ్య (తెలంగాణ పత్రిక), ప్రధాన కార్యదర్శిగా బి. సాయిలు (ప్రభ న్యూస్), కోశాధికారిగా గాయక్వాడ్ రాము (జనం సాక్షి), సహాయ కార్యదర్శిగా పి. పెంటయ్య (ఆంధ్ర ప్రభ)లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముఖ్య సలహాదారులుగా రాజు (అక్షర టుడే), బేగరి రాములు (పోరు న్యూస్), గౌరవ అధ్యక్షులుగా గోగినేని హన్మంతరావు (జ్ఞాన తెలంగాణ), సాయిబాబా గౌడ్ (భారతి డిజిటల్ న్యూస్) లను ఎంపిక చేశారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు కాసుల శ్రీకాంత్ (నవతెలంగాణ), గంగాధర్, ఎడ్డెడి అనిల్ (ప్రజావాణి), పబ్బ నవీన్ (నమస్తే ఇందూరు వార్త), హైమద్ (ఆజ్ కా తెలంగాణ), వి. నరేష్ (సమయం), గంట్ల రాజు (మన తెలంగాణ) తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు ప్రెస్ క్లబ్ సభ్యులు అభినందనలు తెలియజేశారు. పాత్రికేయుల సంక్షేమం, వృత్తి అభివృద్ధి, ఐక్యత కోసం సమష్టిగా కృషి చేస్తామని నూతన కార్యవర్గం పేర్కొంది.
