
రుద్రూర్ : జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని బోధన్ చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం చేనేత కార్మికులను ఘనంగా సన్మానించారు. రుద్రూర్ చేనేత సహకార సంఘం ఆవరణలో అధ్యక్షుడు లోల శంకర్ అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లోల శంకర్ మాట్లాడుతూ.. భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని, కళాత్మక సృజనాత్మకతను కాపాడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు చేనేత రంగం వెన్నెముకగా నిలుస్తోందన్నారు. చేనేత కార్మికుల సంక్షేమాన్ని ప్రోత్సహించడంతో పాటు వారి సేవలను గుర్తించేందుకు ప్రతి ఏటా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బోధన్, రుద్రూర్ ప్రాంతాల్లో చేనేత రంగానికి సేవలందిస్తూ సంఘం అభివృద్ధికి కృషి చేసిన కార్మికులను సన్మానించడం గర్వంగా ఉందన్నారు.
కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మోత్కూరి నారాయణ, కార్యదర్శి శ్యామ్‌సుందర్ పహాడే, సభ్యులు బేతి గంగారాం, మోత్కూరి సాయిలు, మోత్కూరి లక్ష్మణ్, తాటిపాముల విజయ్, జోర్రీగల లక్ష్మి, మోత్కూరి కళావతి, సన్మాన గ్రహీతలు మామిడి పండరి, నూత్పల్లి నాగమణి, గట్టు సాయిలు, మోత్కూర్ నడిపి గంగారాం, సంఘం సిబ్బంది ఈర్వ నాగరాజు, అంకం నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
