
పోతంగల్ : ఆరోగ్యశ్రీ పథకం అమలుకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చేసిన పోరాటమే కారణమని ఎమ్మార్పీఎస్ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం పోతంగల్ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని నివాళులర్పించారు. ఎమ్మార్పీఎస్ బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జి సోంపూర్ పోచిరాం మాదిగ, మండల ఇన్‌చార్జి నేరెళ్ల అశోక్ మాదిగ మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో మందకృష్ణ మాదిగ చేసిన పోరాటాల ఫలితంగానే ఆరోగ్యశ్రీ వంటి పథకాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఆయన చేసిన ఉద్యమాలను కొనియాడారు. కార్యక్రమంలో హరిదాస్ మాదిగ, కాంగ్రెస్ నాయకుడు గంధపు రాజు, బీజేపీ నాయకుడు పబ్బ శేఖర్, తిరుమలాపూర్ విజయ మాదిగ, సంకిని ఉపసర్పంచ్ చంద్రకాంత్, వార్డు సభ్యుడు పోశెట్టి, ఎర్రోళ్ల శంకర్ మాదిగ, నేరెళ్ల భూమయ్య మాదిగ, సాయి మాదిగ, పీరయ్య తదితరులు పాల్గొన్నారు.
