ఘనంగా ఎంపీ సురేష్‌కుమార్‌ శెట్కార్‌ జన్మదిన వేడుకలు

రుద్రూర్: జహీరాబాద్‌ ఎంపీ సురేష్‌కుమార్‌ శెట్కార్‌ జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో శనివారం బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఇందూర్‌ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.  అన్నదాన కార్యక్రమం చేపట్టడంతో పాటు కేక్‌ కట్‌ చేసి ఎంపీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఎంపీ సురేష్‌కుమార్‌ శెట్కార్‌ ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రజలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో రుద్రూర్‌ మండల సర్పంచ్‌ ఇందూర్‌ సునీత చంద్రశేఖర్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు తోట అరుణ్‌కుమార్‌, సర్పంచ్‌ కొండల్‌వాడి శంకర్‌, దిశా కమిటీ సభ్యుడు రాంబాబు, నగేష్‌, రుద్రూర్‌ ఉపసర్పంచ్‌ షేక్‌ నిస్సార్‌, జిల్లా కార్యదర్శి పత్తి రాము, మాజీ జడ్పీటీసీ నారోజీ గంగారాం, షేక్‌ గౌస్‌, దత్తు, కుర్మాజీ సాయిలు, శానం కపిల్‌, నాగయ్య, వడ్ల నరేష్‌, ఇమ్రాన్‌, పార్వతి ప్రవీణ్‌, వార్డు సభ్యులు అమంద్‌ వెంకటేష్‌, రాజాగౌడ్‌, కర్రోళ్ల పోశెట్టి, శివ, పోతురాజు లింగం, శివశంకర్‌, కాసుల ఉమామహేష్‌, బర్ల గంగాధర్‌, అక్కపల్లి నాగేందర్‌, విజయ్‌కాంత్‌, రాయకూరు ఉపసర్పంచ్‌ షేక్‌ జావీద్‌ పటేల్‌, ఫుర్ఖన్‌, గొల్ల పవన్‌, ఇందూర్‌ శ్రీనివాస్‌, దుర్కి సాయికుమార్‌ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.