
రుద్రూర్ : ప్రతి ఒక్కరు భక్తి మార్గాన్ని అలవర్చుకోవాలని బీదర్ కు చెందిన దత్తానంద స్వామి సంస్థానం స్వామీజీ వైకుంఠ దత్త మహారాజ్ ఉద్బోధించారు. మండల కేంద్రంలోని సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో 76వ వార్షిక వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. 1950లో ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఏటా భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం బీదర్‌కు చెందిన స్వామీజీ భక్తులకు ప్రవచనం చేశారు. ఈ సందర్భంగా గణనాథుడి మహిమ, భక్తి మార్గం, ఆధ్యాత్మిక విలువలను వివరించారు. ప్రవచనాన్ని వినేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
