రుద్రూర్ లో మట్టి గణపతుల పంపిణీ

రుద్రూర్: మండల కేంద్రంలోని గాంధీచౌక్ వద్ద సోమవారం బీఆర్‌ఎస్ నాయకులు మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేశారు. బాన్సువాడ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో, మోరల్ శ్రీనివాస్ సహకారంతో కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ మండల  ఇన్‌చార్జి గాండ్ల మధు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు  డౌర్ సాయిలు, కొత్తపల్లి రవికిరణ్, జువ్వల శ్రవణ్, పార్వతి రాములు, శివకుమార్, వంజరి సుమన్, శేఖర్, మతిన్ తదితరులు పాల్గొన్నారు.