ఘనంగా మోదీ జన్మదిన వేడుకలు

రుద్రూర్: భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం రుద్రూర్‌లో బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. అంగడి బజార్‌లోని వినాయకుడి ఆలయంలో మోదీ పేరు మీద ప్రత్యేక అర్చన చేశారు. అనంతరం రుద్రూర్ చౌరస్తాలో బాణసంచా కాల్చి, ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యుడు గూడూరు ప్రశాంత్ గౌడ్, జిల్లా నాయకుడు కటిక రామరాజు, మండల అధ్యక్షుడు ఆలపాటి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి ఏముల గజేందర్, వడ్ల సాయినాథ్, ఉపాధ్యక్షులు జీలకర్ర విజయ్, భోజిగొండ అనిల్, బేగరి వినోద్‌కుమార్, సీనియర్ నాయకులు పార్వతి మురళి, వెంకటేశ్వర గుప్తా, చిదురా మహిపాల్, మహిళా మోర్చా అధ్యక్షురాలు ఇత్తడి నాగరాజకుమారి, గోంటి కళ్యాణి, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బేగరి శివప్రసాద్, బేగరి సాయికుమార్, ఎర్రోళ్ల శంకర్, గంగాధర్, బూత్ అధ్యక్షులు గొల్ల శంకర్, వెంకటేష్, బైండ్ల సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.