

రుద్రూర్: గణేష్ మండపాల నిర్వాహకులకు ‘జై శ్రీరామ్’ ఆధ్వర్యంలో లడ్డూలను పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యే, బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి ఎండల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జిల్లా కౌన్సిల్ సభ్యుడు ప్రశాంత్ గౌడ్, పార్వతి మురళి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రతి మండపం వద్ద భక్తి పాటలు, భజన కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని సూచించారు.
నిమజ్జనానికి ముందు హనుమాన్ చాలీసా పారాయణం చేసి శోభాయాత్రలో పాల్గొనాలని కోరారు. మండలవ్యాప్తంగా 90 లడ్డూలు పంపిణీ చేయగా, రుద్రూర్లో 42 లడ్డూలు అందజేశారు.
