వైభవంగా వినాయక నిమజ్జన శోభాయాత్ర

వర్ని :మండలంలోని జాకోరా గ్రామంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర బుధవారం వైభవంగా కొనసాగింది. గ్రామంలోని 19 గణనాథుల విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. యువత, భక్తులు నృత్యాలు, కోలాటాలతో సందడి చేశారు. భక్తుల జయజయధ్వానాలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గురువారం ఉదయం స్థానిక భామన్‌కుంటలో గణనాథుల విగ్రహాలను నిమజ్జనం చేయనున్నట్లు గ్రామస్థులు తెలిపారు.

జాకోరాలో వినాయక నిమజ్జన శోభాయాత్ర