హరిద్వార్‌కు యోగా శిక్షకులు

రుద్రూర్ : ప్రముఖ యోగ గురువు రాందేవ్‌బాబా ఆధ్వర్యంలో హరిద్వార్‌లో నిర్వహించే ముఖ్య యోగ ఉపాధ్యాయ శిక్షణకు రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన యోగా శిక్షకులు బుధవారం బయలుదేరారు. మహర్షి పతంజలి యోగా, ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో అసిస్టెంట్‌ యోగ కోర్సు పూర్తి చేసిన చిదుర మహిపాల్, అడప శంకర్, నరేందర్, గాండ్ల సాయన్న ప్రిన్సిపల్‌ యోగ శిక్షణలో పాల్గొననున్నారు. ఈ శిక్షణ ఈ నెల 25 నుంచి 29 వరకు కొనసాగనుంది.
కార్యక్రమంలో యోగ మాస్టర్‌ డాక్టర్‌ విశ్వనాథ్‌ మహాజన్, బెజగం వెంకటేశం గుప్తా, కె.వి. మోహన్, నూతిపల్లి బాలరాజ్, గబలే పురుషోత్తం, కర్రోళ్ల శివప్రసాద్, పుట్టి ప్రకాష్, హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు.