గోశాల గోవులకు దాన అందజేత

రుద్రూర్: రుద్రూర్ మండల కేంద్రంలో గోశాలలోని గోవులకు గురువారం కాంగ్రెస్ నాయకులు దాణా అందచేశారు. కాంగ్రెస్ అధినేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కారించుకుని బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ….గో సంరక్ష కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో అత్యాధునిక గోశాలల నిర్మించ తలపెట్టడం ఎంతో ఆనందాయకమని అన్నారు. కార్యక్రమంలో విండో డైరక్టర్ కర్క అశోక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందూర్ కార్తీక్, తాటికొండ రవికుమార్, వడ్ల నరేష్, కాసుల శ్రీనివాస్, గాండ్ల శ్రీనివాస్, శివ శంకర్, లక్ష్మణ్, పుర్కాన్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.