రుద్రూర్ : నూతన సంవత్సర వేడుకలు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జరుపుకోవాలని ఎస్సై సాయన్న సూచించారు. సోమవారం ఎస్సై మాట్లాడుతూ… రాత్రి వేళ మద్యం సేవించి న్యూసెన్స్ సృష్టించినా, డీజేలు పెట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రశాంతమైన వాతవరణంలో వేడుకలు జరుపుకోవాలని సూచించారు.
ముమ్మరంగా వాహనాల తనిఖీలు
రుద్రూర్ మండల కేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎస్సై సాయన్న ఆధ్వర్యంలో సోమవారం వాహనాల తనిఖీ చేపట్టారు. వాహన దారుల డ్రైవింగ్ లైసెన్స్ , వాదాహనాల ఇన్సూరెన్స్ తదితర దృవీకరణ పత్రాలు పరిశీలించారు. సరైన పత్రాలు లేనివారికి జరిమాన విధించారు. ఎస్సై వెంట స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు.

